నవతరం

తెలుగు దినపత్రిక

ఆదివాసులకో న్యాయం, కవితకో న్యాయమా?

* బిసి రిజర్వేషన్ల కోసం మోడిని నిలదీయాలి
* ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజీనామా చేయాలి
* సెక్రటేరియట్ బదులు టాయిలెట్స్ నిర్మించండి
* డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ

పెద్దపల్లి, నమస్తే ఎల్లంపల్లి: వందకోట్ల పేదల డబ్బు దోచుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపి లిక్కర్ స్కాం చేసిన ఎమ్మెల్సీ కవితకు ఒక న్యాయం,తిండి కోసం ఇరవై ఏళ్లుగా పోడు చేసుకున్న ఆదివాసులకు ఇంకో న్యాయమా అని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులు విచారణ జరిపి చార్జిషీట్ లో పేరున్నా కూడా కవిత భంగుళాల్లో ఉంటే,ఆదివాసులు మాత్రం తిండికోసం పోడు చేసుకున్నందుకు అన్యాయంగా హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారని,ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా పోడు భూమికి పట్టాలిస్తామని హామి ఇచ్చి,సర్వేల పేరుతో డ్రామా చేసి ఆఖరికి పట్టాలివ్వకుండా జైలుకు పంపారని ఆయన మండిపడ్డారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 149వ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లక్షల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా చేసిందని, కేవలం రెండువందల గజాల జాగ ఇచ్చి నాలుగు ఎకరాల భూమి లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగ్రామ యాత్ర చేస్తున్న సంజయ్, బిసి బిడ్డ అయ్యుండి బిసి రిజర్వేషన్ల కోసం ఎందుకు మోడిని నిలదీయడం లేదని నిలదీశారు. దమ్ముంటే బిసి కులగణన చేసి,రిజర్వేషన్లు పెంచాలని మోడిని నిలదీయాలని సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తమిళనాడు, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల వలే ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా బిసిలకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పోలీస్ నియామకాల్లో లాంగ్ జంప్ 3.8 మీటర్ల నుండి నాలుగు మీటర్లకు పెంచడం వల్ల వేలాదిమంది అభ్యర్థులు నష్టపోతున్నారని, ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా, గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈవెంట్స్ నిర్వహించడం వల్ల విద్యార్థులు చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం లాంగ్ జంప్ 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని జిల్లా కేంద్రంలోనే కరెంట్ లేని గుడిసెలు ఉన్నాయని, కనీసం కరెంట్ సౌకర్యం కల్పించలేని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో చాలా మంది పేదలకు ఇళ్లు లేక చీరలు కట్టుకొని నివసిస్తున్నారని,ప్రభుత్వం పెద్దపల్లి కుందారం దగ్గర రైల్వే ట్రాక్ మీద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. వాల్ల ఫాంహౌస్ లకు అద్దం లాంటి రోడ్లు వేసుకొని,మనకు మాత్రం కనీసం సరైన రవాణా సౌకర్యాలు కల్పించడంలేదని పేర్కొన్నారు. కూనారం గ్రామంలో యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదల భూమికి ఇప్పటివరకు పట్టాలివ్వలేదని,గ్రామస్థులు వ్యవసాయం చేస్తే రైతుబంధు దోపిడి వర్గాలకు పోతున్నాయని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యంలో పేదల భూములన్నిటికీ పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు, నాలుగు వందల మంది విద్యార్థులున్న చోట ఒకే టాయిలెట్ ఉండడం ఏంటన్నారు. 2వేల కోట్లతో సెక్రటేరియట్, ఏడువందల కోట్లతో కంట్రోల్ సెంటర్ నిర్మించే బదులు టాయిలెట్స్ నిర్మించి విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించవచ్చని సూచించారు. ఈ బాధలన్ని పోవాలంటే బహుజన రాజ్యం రావాలని, అందుకు ఏనుగు గుర్తుకే ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హనుమయ్య, అసెంబ్లీ ఇంచార్జి దాసరి ఉష, జిల్లా ఇంచార్జి శేఖర్, జిల్లా అధ్యక్షులు దుర్గయ్య, జిల్లా మహిళా కన్వీనర్ స్వప్న గౌడ్, శారద, సుమతి, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading