నవతరం

తెలుగు దినపత్రిక

ప్లాంట్ శంఖుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

జపాన్ మిట్స్ బుషి హెవీ ఇండస్ట్రీస్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ శంఖుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే…

ములుగు, నమస్తే ఎల్లంపల్లి: ములుగు మండల పరిధిలోని తునికి బొల్లారం ఇండస్ట్రియల్ పార్క్ లో ఆజాద్ – సీఓఈ & ఇన్నోవేషన్ సెంటర్ లో 11,800 స్క్వేర్ మీటర్ల స్థలాన్ని జపాన్ కు చెందిన మిట్స్ బుషి హెవీ ఇండస్ట్రీస్ కు ప్రత్యేకంగా కేటాయించి నూతనంగా చేపడుతున్న మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణ పనులకు ఈరోజు రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, టకసాగో మెషినరీ వర్క్స్ జపాన్ డిప్యూటీ సీఈఓ కట్సునోరి టనక, జపాన్ మిట్స్ బుషి, అజాద్ ఇంజనీరింగ్ సంస్థలకు చెందిన ఇండస్ట్రియలిస్ట్ లతో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కను నాటి మిట్స్ బుషి, అజాద్ ఇంజనీరింగ్ సంస్థ యాజమాన్యాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు కుత్బుల్లాపూర్ కు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading