• పన్నాల హరీష్ రెడ్డి
కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: భారతీయ జనతా పార్టీని కూకట్ పల్లి నియోజకవర్గంలో పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు, నాయకులు శక్తి వంచనతో తమ వంతు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి కాలనీ డివిజన్ లో బిజెపి అధ్యక్షుడు గంధం రాజు ఆధ్వర్యంలో శుక్రవారం బూతు స్థాయి అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పన్నాల హరీష్ రెడ్డితో పాటుగా బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పటిష్టపరిచే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి నేతలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర రావు, డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి రేవతి,మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.