* బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికీ సురక్షితమైన త్రాగునీరు
* మంచినీటి సరఫరా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: గాజులరామారం డివిజన్ పరిధిలోని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీలో సుమారు రూ.35.00 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ కాలనీ, బస్తీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో బిందెలతో కుస్తీలు, మంచినీటి కష్టాలు, ధర్నాలు ఉండేవని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ ఇంటికి మెరుగైన మంచినీటి సరఫరా అందుతుందని అన్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి వహించి పని చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాలనీలో మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ రోహిణి, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నవాబ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, మసూద్, ఇబ్రహీం, కాలనీ సలహాదారుడు సోమిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, లక్ష్మీ, కవిత, మూసాఖాన్, చందు ముదిరాజ్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్ బైగ్, మహేష్ మరియు కాలనీ ప్రెసిడెంట్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, జనరల్ సెక్రెటరీ రామానాయుడు, జాయింట్ సెక్రటరీ సురేంద్ర, ఆనంద్ కుమార్, నాగరాజు, శ్రీధర్, మోహన్ రావు, ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.





































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.